తెలంగాణ

12వ వార్డులో వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ  

12వ వార్డులో వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ   పరకాల , తెలంగాణ గళం ,నవంబర్ 18: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్…

By · · Updated

Share this article
12వ వార్డులో వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ  

12వ వార్డులో వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ  

పరకాల , తెలంగాణ గళం ,నవంబర్ 18:

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనానికి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.

పేదలు, నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచిన కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: