కరీంనగర్ :
కొత్తపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నాయకులు రైతుల ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 'వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి' అనే ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముత్తునూరి హరీష్, కుంట తిరుపతి, జాడి బాలిరెడ్డి, అంజన్ ప్రసాద్, ప్రవీణ్, నరేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: బీజేపీ డిమాండ్
కరీంనగర్ :కొత్తపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నాయకులు రైతుల ధ…
By తెలంగాణ గళం · · Updated
Share this article


