హనుమకొండ జిల్లా: నవంబర్ 21, 22 తేదీల్లో జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీలో జరగనున్న అఖిల భారత వ్యవసాయ–గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) 8వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం హసన్‌పర్తి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద జిల్లా కార్యదర్శి గోల్కొండ కుమార్ ఆధ్వర్యంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమిలేని పేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని, కౌలు రైతులకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని కోరారు. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు తమ హక్కుల సాధన కోసం కుల, మత భేదాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి గబ్బెట సతీష్, ప్రజాసంఘాల నాయకులు మంద వీరస్వామి, శీలం బాలకిషన్, బందెల రవి, కారింగుల మధు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మోడెమ్ సందీప్


