ఆరోగ్యం

తెలంగాణను వణికిస్తున్న చలి.. 9.6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

  కరీంనగర్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సత్యార్‌లో 9.6, కోహిర్‌లో 9…

By · · Updated

Share this article


 

కరీంనగర్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సత్యార్‌లో 9.6, కోహిర్‌లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 10.5, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 10.7, వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 11, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 12, నిజామాబాద్ జిల్లా వర్నిలో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వచ్చే మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags: