ఆరోగ్యం

సాయంత్రం వేళ మనసుకు ప్రశాంతత.. కరీంనగర్ డ్యామ్ వద్ద సందర్శకుల సందడి!

  ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరుతూ.. రోజంతా అలసటను మరిచిపోతున్న నగరవాసులు! తెలంగాణ గళం కరీంనగర్ ఆర్ సి  కరీంనగర్ డ్యామ్.. సాయంత్రం కాగానే ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రదేశంగా మారుతోం…

By · · Updated

Share this article

 

ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరుతూ.. రోజంతా అలసటను మరిచిపోతున్న నగరవాసులు!

తెలంగాణ గళం కరీంనగర్ ఆర్ సి 

కరీంనగర్ డ్యామ్.. సాయంత్రం కాగానే ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రదేశంగా మారుతోంది. రోజంతా పని ఒత్తిళ్లు, ఉరుకుల పరుగుల జీవితంతో అలసిపోయిన ప్రజలు కాసేపు ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో డ్యామ్ పరిసరాలకు చేరుకుంటున్నారు.

 

చల్లని గాలులు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రకృతి అందాల మధ్య సాయంత్రం వేళ గడిపే ప్రతి క్షణం సందర్శకులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. కొందరు ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తుంటే, మరికొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నారు.

 

చిన్నారుల ఆటపాటలు.. పెద్దల ఆహ్లాదకరమైన సంభాషణలు.. వాకర్స్ అడుగుల సందడితో డ్యామ్ పరిసరాలు కళకళలాడుతున్నాయి. కాసేపు ప్రకృతి ఒడిలో గడిపితే మనసుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో ఇక్కడికి వచ్చే సందర్శకుల ఆనందాన్ని చూస్తే అర్థమవుతుంది.

 

నగర జీవనంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు కాసేపు విరామం ఇచLS

Tags: