హనుమకొండ, నవంబర్ 24:
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన మరియు రేపటి భవిష్యత్తు కోసం ఉద్యమకారులను సంఘటితం చేస్తూ ముందుకు సాగుతున్న 'తెలంగాణ ఉద్యమకారుల ఫోరం' హనుమకొండ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా బూర రాజేశ్వరి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా బూర రాజేశ్వరి మాట్లాడుతూ... సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఫోరం రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానకి రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీనిగి విష్ణువర్ధన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చిలువేరు రమేష్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే, తన నియామకానికి పూర్తిస్థాయిలో సహకరించిన హనుమకొండ జిల్లా అధ్యక్షులు రాము చారి గారికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లాలో మహిళా ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి మరియు ఫోరం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.



