శివ్వంపేట, నవంబర్ 4 (తెలంగాణ గళం):శ్రీ గురు పీఠం ఆధ్వర్యంలో గూడూరులోని అరుదైన శ్రీ దత్తాత్రేయ స్వామి పంచాయతనం, పంచవటి, షిర్డీ సాయి మందిరాలను దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులకు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ గౌడ్ సూచించారు.ఆధ్యాత్మిక మార్గంలో తొలి అడుగుగా నిలిచే శాస్త్రోక్తమైన శ్రీ దత్తాత్రేయ స్వామి పంచాయతనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు ఆధ్యాత్మిక మార్గంలో పరిష్కారాలను అన్వేషించేందుకు శ్రీ గురు పీఠం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఉదయం 6.30 గంటలకు బాబాకు మంగళస్నానం, 8 గంటలకు అర్చన, హారతి, 9 గంటలకు శ్రీ దత్తాత్రేయ స్వామి పంచాయతనానికి అభిషేకం, అర్చన అనంతరం హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బాబాకు హారతి, 1.30 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని శ్రీ గురు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ గౌడ్ కోరారు.
రేపు శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ
శివ్వంపేట, నవంబర్ 4 (తెలంగాణ గళం):శ్రీ గురు పీఠం ఆధ్వర్యంలో గూడూరులోని అరుదైన శ్రీ దత్తాత్రేయ స్వామి పంచాయతనం, పంచవటి, షిర్డీ సాయి మందిరాలను దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులకు పీఠం…
By తెలంగాణ గళం · · Updated
Share this article






