తెలంగాణ

మున్సిపల్ సిబ్బంది సేవలకు గుర్తింపుగా.. చైర్మన్ చేతుల మీదుగా దుస్తుల పంపిణీ

పరకాల తెలంగాణ గళం నవంబర్ 24 పట్టణ పరిశుభ్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిబ్బందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చ…

By · · Updated

Share this article
మున్సిపల్ సిబ్బంది సేవలకు గుర్తింపుగా.. చైర్మన్ చేతుల మీదుగా దుస్తుల పంపిణీ

పరకాల తెలంగాణ గళం నవంబర్ 24

పట్టణ పరిశుభ్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిబ్బందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ తన చేతుల మీదుగా పారిశుద్ధ్య విభాగంతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి దుస్తులు అందజేశారు.

 

మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్మన్ సునీల్ మాట్లాడుతూ.. ఎండనకా, వాననకా తేడా లేకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పట్టణం పరిశుభ్రంగా, సుందరంగా కనిపించడం వెనుక సిబ్బంది కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.

 

సిబ్బంది సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: